Trucks

Image
Disclaimer
Disclaimer

ఈ సెక్షన్‌లో పొందుపరిచిన డేటా, ఇతర వివరాలన్నీ సరైనవి, సంపూర్ణంగా ఉండేలా టాటా మోటర్స్‌ చూస్తుంది. అయితే ఈ సెక్షన్‌లో ఏదైనా పొరపాటు లేదా ఏదైనా తప్పు చోటుచేసుకుంటే దానికి బాధ్యత వహించదు. ఇందులో ప్రచురించిన సమాచారం పోస్ట్‌ చేసినప్పుడు, క్రమం తప్పకుండా అప్‌డేట్‌ చేసినప్పుడు అది కచ్చితత్వంతో ఉండేలా మేము ప్రతీ జాగ్రత్త తీసుకుంటాము. ఎటువంటి నోటీసు లేకుండా సమాచారాన్ని మార్చుతూ ఉంటాము కాబట్టి దాని కచ్చితత్వానికి మేము గ్యారెంటీ ఇవ్వలేము.

ప్రత్యక్షంగా కాని పరోక్షంగా గాని ఎటువంటి వారెంటీ ఇవ్వకుండా మేము ఈ డేటాను ఉన్నది ఉన్నట్టుగా- ప్రచురిస్తున్నాం. ఈ సెక్షన్‌లోని డేటా లేదా సమాచారం ఉపయోగించడం వల్ల లేదా అనధికారికంగా ఈ సెక్షన్‌యాక్సెస్‌ చేసినా లేదా ఏ కారణం చేతైనా (చట్టప్రకారం అవసరమైన మేరకు మినహా) తలెత్తే ఎటువంటి నష్టం, క్లెయిములకు టాటా మోటర్స్‌ ఎటువంటి బాధ్యత వహించదు.

ముఖ్యమైన ఆర్థిక గణాంకాలు, ఇంటరాక్టివ్‌ చార్టులు లేదా షేర్‌ ధరలు, గ్రాఫ్స్‌లో ఉన్న సమాచారం ఏ రకంగానూ షేర్లు లేదా ఇతర ఉత్పత్తులు లేదా సేవలు, లేదా ఇంకేదైనా ఒప్పందం లేదా టాటా మోటర్స్‌ లేదా ఏదేని ఇతర కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోవడానికి ఎంత మాత్రమూ ఆహ్వానం కాదు. పెట్టుబడులకు సంబంధించి ఇందులోని సమాచారంపై ఆధారపడరాదు.

అలా చేసే ముందు ఈ సమాచారాన్ని పరిశీలించేందుకు మీరు తగిన చర్యలు తీసుకోవాలి. ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన టాటా మోటర్స్‌ లేదా ఇతర గ్రూప్‌ కంపెనీల గత పనితీరు అనేది భవిష్యత్‌ పనితీరుకు సూచికగా పరిగణించరాదు.

షేర్ల ధరలు, వాటి నుంచి వచ్చే ఆదాయం తగ్గవచ్చు, పెట్టుబడిదారులు తమ పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని తిరిగి పొందలేకపోవచ్చు కూడా. ఇక్కడ ప్రదర్శిస్తున్న షేర్ల ధరలు, గ్రాఫులు అనేవి 15 నిమిషాల ఆలస్యంతో ఉంటాయి.

ఈ సెక్షన్‌లోని సమాచారాన్ని మీరు మీ వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించుకునేందుకు ప్రింట్‌ తీసుకోవచ్చు. వాటికి సంబంధించిన నోటీసులు మరియు/లేదా డిస్‌క్లెయిమర్లను కూడా చూడాలని సూచిస్తున్నాం. ఈ సెక్షన్‌లో పొందుపరిచిన కంపెనీ లక్ష్యాలు, ప్రొజెక్షన్లు, అంచనాలు, ఊహలన్నీ కూడా వర్తించే సెక్యూరిటీ చట్టాలు, నిబంధనల ప్రకారం భవిష్యత్‌ దృష్టితో కూడిన స్టేట్‌మెంట్లు.

వ్యక్తం చేసినా లేదా సూచించిన వాటికి భిన్నంగా వాస్తవ ఫలితాలు ఉండవచ్చు. కంపెనీ కార్యకలాపాలను ప్రభావితం చేసే అంశాల్లో డిమాండ్‌/సరఫరాను ప్రభావితం చేసిన ఆర్థిక పరిస్థితులు, కంపెనీ కార్యకలాపాలు సాగించే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ధరల పరస్థితులు, ప్రభుత్వ నిబంధనలు, పన్నులు, ఇతర చట్టాల్లో మార్పులు, ఇతర అంశాలూ ఉంటాయి.