Trucks

భారతదేశపు ఏకైక సంపూర్ణ ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్ తయారీదారు

భారతదేశంలో ఏకైక సంపూర్ణ ఇంటిగ్రేటెడ్‌ ఆటోమొబైల్‌ తయారీదారు టాటా మోటర్స్‌. దీని పోర్టుఫోలియోలో ట్రక్కులు, బస్సులు, యుటిలిటీ వాహనాలు, ప్రయాణికుల కార్లు ఉన్నాయి.

భారతదేశంలో నేడు అత్యధిక ఉత్పత్తి సామర్ధ్యం

దేశవ్యాప్తంగా ఉన్న మా అత్యాధునిక ఉత్పత్తి కేంద్రాల్లో టాటా మోటర్స్‌ ట్రక్కులు తయారవుతాయి. దిగువున్న ప్రదేశాలపై క్లిక్‌ చేసిన మరిన్ని వివరాలు తెలుసుకోండి:

మా తయారీ కేంద్రాలు

లక్నో

భారతీయ మార్కెట్‌లో పెరుగుతున్న వాణిజ్య వాహనాల డిమాండ్‌ తీర్చేందుకు 1992లో లక్నోలో ఏర్పాటు చేసిన టాటా మోటర్స్‌ ఉత్పత్తి కేంద్రం అతి పిన్న వయస్సు కలిగినది. అత్యాధునిక సాంకేతికతతో ఆటోమొబైల్ తయారీ, అవసరాలు తీర్చేందుకు ఏర్పాటు చేసిన ఈ కేంద్రానికి ఇంజినీరింగ్‌ రీసెర్స్‌ అండ్‌ సర్వీస్‌ సిస్టమ్‌ తోడ్పాటు బలంగా ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపార విభాగాలలో ఒకటైన ఫుల్లీ బిల్ట్ వెహికల్ వ్యాపారం కూడా లక్నోలోనే ఉంది. వాణిజ్య వాహనాలు తయారు చేసే మా లక్నో ప్లాంట్‌, లో-ఫ్లోర్‌, అల్ట్రా లో-ఫ్లోర్‌, CNG & రియర్‌ ఇంజిన్‌ బస్సుల ఛాసిస్‌ సహ అత్యాధునిక బస్సుల తయారీ, డిజైన్‌లో ప్రత్యేకత కలిగి ఉంది. HCBS (హై కెపాసిటీ బస్‌ సిస్టమ్‌) బస్సుల తయారీలోనూ లక్నో కేంద్రం ప్రత్యేకత కలిగి ఉంది.

Image
Lucknow Map
జంషెడ్‌పూర్‌

జంషెడ్‌పూర్‌లో 1945లో స్థాపించిన యూనిట్ 822 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది కంపెనీకి చెందిన మొదటి తయారీ కేంద్రం. టాటా 697/497 నేచురల్లీ ఆస్పిరేటెడ్‌, టర్బోచార్జ్డ్ ఇంజిన్లు, టాటా కమ్మిన్స్‌లో తయారయ్యే 6B సిరీస్ ఇంజిన్ల అంతర్గత తయారీకి జంషెడ్‌పూర్ ప్లాంట్‌ ఇంజిన్ ఫ్యాక్టరీ బాధ్యత వహిస్తుంది. టాటా మోటార్స్ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ HV యాక్సెల్స్‌ లిమిటెడ్‌-ఫ్రంట్ స్టీర్ యాక్సిల్స్ -లైవ్, నార్మల్, రియర్ డ్రైవ్ యాక్సిల్, డమ్మీ/ట్రైలర్ యాక్సిల్స్‌ తయారు చేస్తుంది. ఇది టాటా మోటార్స్ జంషెడ్‌పూర్‌, లక్నో ప్లాంట్లకు పెద్ద బస్ యాక్సిల్స్‌ అందిస్తున్న ఏకైక సరఫరాదారు. ఫ్రంట్ యాక్సిల్ బీమ్, స్టబ్ యాక్సిల్స్, ఫ్రంట్ & రియర్ వీల్ హబ్‌లు, డిఫరెన్షియల్, యాక్సిల్ గేర్లు (క్రౌన్ వీల్, పినియన్, బెవెల్ గేర్ & షాఫ్ట్ గేర్), బాంజో యాక్సిల్ బీమ్, స్వివెల్ హెడ్‌లు, కాన్‌స్టంట్‌ వెలాసిటీ షాఫ్ట్స్‌ సహ ప్రధాన యాక్సిల్ భాగాలు కూడా కంపెనీ తయారు చేస్తుంది. ఆటోమోటివ్‌ ట్రాన్స్‌మిషన్లు, కాంపోనెంట్‌లు, గేర్‌బాక్స్‌లు, భారీ, మధ్యస్తాయి వాణిజ్య వాహనాల్లో ఉపయోగించే ఇంజినీరింగ్ అప్లికేషన్‌లలో ప్రముఖ తయారీదారు HV యాక్సెల్స్‌ లిమిటెడ్‌.

Image
Jamshedupur Map
పుణె

పూణె యూనిట్ రెండు ప్రాంతాలు -పింప్రి (800 ఎకరాలు), చించ్వాడ్ (130 ఎకరాలు)లో విస్తరించి ఉంది. 1966లో నెలకొల్పిన ఈ కేంద్రంలో భారత ఉపఖండంలో అత్యంత బహుముఖ సాధనాల తయారీ సదుపాయాలతో కూడిన ఉత్పత్తి ఇంజినీరింగ్ విభాగం ఉంది. మా పూణె కేంద్రం డీజిల్, CNG ఫ్యూయల్‌ ఆప్షన్స్‌తో కూడిన టాటా ఇంజిన్లు తయారు చేస్తుంది. ఇందులో LCV బస్ ఛాసిస్ కోసం ప్రత్యేక అసెంబ్లీ లైన్‌ కూడా ఉంది. అధునాతన ప్రెస్ టూల్స్, జిగ్‌లు, ఫిక్చర్స్‌, గేజ్‌లు, మెటల్ ప్యాటన్‌, ప్రత్యేక సాధనాల డిజైన్‌, తయారీ సహ కొత్త శ్రేణి బస్సులు, కోచ్‌ల అభివృద్ధి, డిజైన్‌ రూపకల్పనలో ఇది నిమగ్నమై ఉంది. చించ్‌వాడ్‌, మావల్‌లోని పూర్తి ఆటోమేటెడ్‌ ఫౌండ్రీలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవని పరిశ్రమ నిపుణులు కితాబిస్తున్నారు.

Image
Pune Map