టాటా మోటర్స్ లిమిటెడ్ (ఇకపై TML అని పేర్కొనడం జరుగుతుంది) మీ వ్యక్తిగత డేటా గోప్యత, భద్రత పరరిక్షించేందుకు కట్టుబడి ఉంటుంది. మా వ్యాపార ప్రక్రియలో మీ వ్యక్తిగత డేటా ప్రాసెస్ చేసే విషయంలో మేము మీ గోప్యత పరిరక్షించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. వర్తించే చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా సేకరించిన వ్యక్తిగత డేటా మేము ప్రాసెస్ చేస్తాం.
ఈ గోప్యతా విధాన ప్రధాన లక్ష్యం మేము సేకరించిన వ్యక్తిగత డేటా స్వభావం, అటువంటి డేటా సేకరణ, దాని ఉపయోగపు ఉద్దేశం, అటువంటి డేటా తదుపరి ప్రాసెసింగ్, మాకు అందజేసినటువంటి వ్యక్తిగత డేటాకు సంబంధించి మీ హక్కులు మీకు తెలియజేయడం. ఈ గోప్యతా విధానం మీ వ్యక్తిగత డేటా రక్షణకు సంబంధించిన మీ హక్కులు మరింతగా తెలియజెప్తుంది. ఈ గోప్యతా విధానం మీ నుంచి TML సేకరించే సమాచారం గురించి, ఆ సమాచార ఉపయోగం, నిర్వహణ, భాగస్వామ్యం, పదిలపరచడం సహ దానిని మీరు ఎలా అప్‌డేట్ చేయవచ్చో వివరిస్తుంది. ఎలక్ట్రానిక్ లేదా పేపర్ సహా ఏదైనా ఫార్మాట్‌లో యూరోపియన్ ఎకనామిక్ ఏరియా (“EEAâ€) నుంచి TML అందుకునే మొత్తం వ్యక్తిగత డేటాకు కూడా ఇది వర్తిస్తుంది. దిగువ పోస్ట్ చేసిన తేదీ నుంచి ఇది అమలులోకి వస్తుంది, ప్రభావిత తేదీ తర్వాత మీ సమాచారాన్నీ మేము వినియోగించడం జరుగుతుంది.
ఈ గోప్యతా విధానంలో పేర్కొన్నవి మినహా సాధారణంగా, మీరు మీ వ్యక్తిగత గుర్తింపు అందించకుండానే మా వెబ్‌సైట్ సందర్శించవచ్చు/ఉపయోగించవచ్చు. చట్టబద్ధంగా, ఆచరణ సాధ్యమైన సందర్భంలో మీరు మీ వ్యక్తిగత గుర్తింపు తెలియజేయకపోయినా మీరు వెబ్‌సైట్ ఉపయోగించుకునేందుకు TML అనుమతి ఇస్తుంది. మీ అవసరాలు సమర్థవంతంగా తీర్చడానికి, వెబ్‌సైట్ సందర్శన సందర్భంగా మీరు విజ్ఞప్తి చేసిన ఉత్పత్తులు, సేవలు లేదా సమాచారం అందించేందుకు వెబ్‌సైట్‌లోని కొన్ని విభాగాలకు మీ వ్యక్తిగత డేటా అవసరం కావచ్చు. మా వెబ్‌సైట్ వినియోగానికి సంబంధించి దిగువన పేర్కొన్న నియమ నిబంధనలు చదివి అర్థం చేసుకోవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. వెబ్‌సైట్ ఉపయోగిస్తున్నారంటే ఇందలి నిబంధనలను బేషరతుగా అంగీకరిస్తున్నారని అర్థం. మా గోప్యతా విధానంలోని నియమనిబంధనలకు అంగీకరించినప్పుడు మాత్రమే మీరు ఈ వెబ్‌సైట్ యాక్సెస్ చేయాలి. గోప్యతా విధానానికి లోబడి మీరందించిన సమాచారాన్ని టాటా మోటర్స్ లిమిటెడ్ ఉపయోగించుకునేందుకు మీరు స్వచ్ఛందంగా సమ్మతి తెలియజేసినట్టు. మా గోప్యతా విధానంలోని నిబంధనలకు మీరు అంగీకరించకపోయినా లేదా వెబ్‌సైట్స్ మరియు/లేదా అందలి సమాచారంపై ఏ కారణం చేతనైనా అసంతృప్తిగా ఉన్నట్టు అయితే వెబ్‌సైట్‌లో మరింత ముందుకు సాగడానికి మీపై నిషేధం ఉంటుంది.
ఈ గోప్యతా విధానాన్ని మీరు చదవాలని మేము ప్రోత్సహిస్తాం.
మేము సేకరించే వ్యక్తిగత డేటా
వ్యక్తిగత డేటా అంటే మీరు ఎవరో, మిమ్మల్ని గుర్తించడానికి, సంప్రదించడానికి లేదా గుర్తించడానికి ఉపయోగించేందుకు TMLకు తెలియజేసే డేటాను సూచిస్తుంది (ఉదా. పేరు, వయస్సు, లింగం, మెయిలింగ్ చిరునామా, టెలిఫోన్ నంబర్, ఈ-మెయిల్ చిరునామా). సర్వేలో రిజిస్టర్ చేసుకోవడం, ఈవెంట్స్ కోసం నమోదు చేసుకున్న సందర్భంలో, వ్యక్తిగతీకరించిన సేవల కోసం రిజిస్టర్ చేసుకున్న సందర్భంలో, ఉత్పత్తి సమాచారాన్ని అభ్యర్థించడం లేదా మా సేవలు ఉపయోగించడం లేదా కస్టమర్ మద్దతు అభ్యర్థించడం వంటి సందర్భాల్లో మీరందించే మీ వ్యక్తిగత డేటా సేకరిస్తాము. మీ పేరు, చిరునామా, పిన్ కోడ్, ఫోన్ నంబర్, ఈమెయిల్ చిరునామా, IP చిరునామా, స్థాన డేటా, మీ పరికరం గురించిన సమాచారం మొదలైన సందర్భాల్లో మీ వ్యక్తిగత డేటా అందించమని మేము మిమ్మల్ని అభ్యర్థించవచ్చు. మీకు సంబంధించి TML దగ్గర ఉండే వ్యక్తిగత డేటా అన్నది ప్రతీసారి నేరుగా మీ నుంచి రాకపోవచ్చు. ఉదాహరణకు మీ యజమాని లేదా మీరు పనిచేసే ఇతర సంస్థల నుంచి కూడా రావచ్చు. మీరు ఈ సైట్ సందర్శించినప్పుడు, మరియు/లేదా ఈ సైట్‌లో అందించే సేవలు ఉపయోగించినప్పుడు TML మీ వ్యక్తిగత డేటా సేకరిస్తుంది. ఉదాహరణకు:
- మీరు ఈ సైట్ ద్వారా ఉద్యోగం లేదా ఇతర ఉద్యోగ అవకాశం కోసం దరఖాస్తు చేసినట్టు అయితే, మీ రెజ్యూమ్‌తో పాటు మీ ఈమెయిల్ చిరునామా, ఫోన్ నంబర్, మెయిలింగ్ చిరునామా వంటి ఇతర సంప్రదింపు సమాచారాన్ని సమర్పించమని మిమ్మల్ని అడగవచ్చు. మీరు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగం కోసం మిమ్మల్ని పరిగణనలోకి తీసుకునేందుకు మేము ఈ సమాచారాన్ని ఉపయోగిస్తాము. ఈ సైట్‌లో పొందుపరిచే ఇతర ఉద్యోగ అవకాశాలకు సంబంధించి మిమ్మల్ని సంప్రదించడానికి కూడా మేము ఈ సమాచారాన్ని ఉపయోగించవచ్చు.
- మా సైటులోని కొన్ని ఫీచర్ల విషయంల మీకు సాయపడేందుకు మేము థర్డ్ పార్టీ సర్వీసు ప్రొవైడరును కూడా ఉపయోగించుకోవచ్చు. మా తరపున మా సర్వీసు ప్రొవైడర్ మీ సమాచారాన్ని అందుకుంటారు, ఇతర అవసరాల కోసం ఉపయోగించడానికి వారిని అనుమతించడం జరగదు.
- ఈ వెబ్‌సైట్ సందర్శన సందర్భంగా మీరు జరిపే ఇంటరాక్షన్స్ సహ, మీరు సర్వేకు సమాధానం ఇవ్వడం, ఈ సైటు లేదా ఈ సైటు అందించే ఇతర సేవల గురించి ఏదైనా సమస్య గురించి మీరు తెలియజేసిన సందర్భాల్లో మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని కోరవచ్చు,
- మీరు మా ద్వారా వ్యాపారం డీలర్‌షిప్/డిస్ట్రిబ్యూషన్‌షిప్ (డీలర్/డిస్ట్రిబ్యూటర్ దరఖాస్తులు ద్వారా) చేయాలనుకుంటే మేము మీ వ్యక్తిగత డేటా సేకరిస్తాం.
- మేము ఆసక్తిగా భావించే సేవలు అందించడానికి, డేటా కచ్చితత్వాన్ని నిర్వహించడానికి, అందించడానికి, సేవలు మెరుగుపరచడంలో మాకు సాయపడేందుకు మా భాగస్వాములు, సర్వీస్ ప్రొవైడర్లు, అందరికీ అందుబాటులో ఉన్న వెబ్‌సైట్స్ వంటి థర్డ్ పార్టీల నుంచి కూడా వ్యక్తిగత డేటా సేకరిస్తాము.
- క్రెడిట్/డెబిట్ కార్డ్ వివరాలు, బ్యాంక్ ఖాతా నంబర్, బ్యాంక్ ఖాతా రకం, బ్యాంక్ పేర్లు మొదలైనవి సహా చెల్లింపు సమాచారం మా అనుబంధ చెల్లింపు గేట్‌వేల ద్వారా సేకరించబడవచ్చు. అటువంటి డేటా మీ లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది.
- మోడల్, సంవత్సరం, రంగు, RTO రిజిస్ట్రేషన్ నంబర్, ఇన్వాయిస్ వివరాలు, వారంటీ వివరాలు, డీలర్ పేరు, కొనుగోలు చేసిన సంవత్సరం వంటి విక్రయ వివరాలు సహా వాహన వివరాలు.
- మీరు మా వెబ్‌సైట్‌ను ఎలా ఉపయోగించారో ఆ వివరాలు.
- క్యాషెలు, సిస్టమ్ కార్యాచరణ, హార్డ్‌వేర్ సెట్టింగ్స్, బ్రౌజర్ రకం, బ్రౌజర్ భాష, మీ సందర్శన తేదీ, సమయం, ఆ పేజీలలో గడిపిన సమయం, ఇతర గణాంకాలు, రిఫరల్ URL వంటి పరికర ఈవెంట్ సమాచారం.
మీ బంధువులు, స్నేహితులు లేదా ఇతర థర్ట్ పార్టీలకు సంబంధించి మీ వ్యక్తిగత డేటా మాకు అందించడం ద్వారా ఈ గోప్యతా విధానంలో పొందుపరిచిన ఉద్దేశాలు/ఉపయోగాల కోసం అటువంటి వ్యక్తిగత డేటా మాకు తెలియజెప్పేందుకు సదరు బంధువులు, స్నేహితులు లేదా థర్ట్ పార్టీ నుంచి మీరు తగిన సమ్మతిని పొందారని మీరు నిర్ధారిస్తూ మాకు హామీ ఇస్తున్నారు.
మా గోప్యతా విధానంలోని నియమనిబంధనలకు అంగీకరించి, ఈ గోప్యతా విధానానికి లోబడి మీరందించిన మొత్తం సమాచారాన్ని టాటా మోటర్స్ లిమిటెడ్ ఉపయోగించేందుకు మీరు స్వచ్ఛందంగా సమ్మతి తెలియజేసినప్పుడు మాత్రమే మీరు ఈ వెబ్‌సైట్ యాక్సెస్ చేయాలి. మా గోప్యతా విధానంలోని నిబంధనలకు మీరు అంగీకరించకపోయినా లేదా వెబ్‌సైట్స్ మరియు/లేదా అందలి సమాచారంపై ఏ కారణం చేతనైనా అసంతృప్తిగా ఉన్నట్టు అయితే వెబ్‌సైట్‌లో మరింత ముందుకు సాగడానికి మీపై నిషేధం ఉంటుంది.
కమ్యూనిటీ డిస్కషన్ బోర్డులు
ఆన్‌లైన్ కమ్యూనిటీ చర్చా వేదికలు, బ్లాగులు లేదా ఇతర వ్యవస్థల ద్వారా వినియోగదారులు ఒకరితో ఒకరు సంభాషించుకునే వెసులుబాటు మా వెబ్‌సైట్ కల్పిస్తుంది. అటువంటి చర్చా వేదికల్లో పోస్ట్ చేసిన వాటిని ఫిల్టర్ చేయడం, పర్యవేక్షించడం వంటివి మేము చేయము. మీరు ఈ చర్చా వేదికల్లో పోస్ట్ చేయాలని భావిస్తే, ఏవైన వ్యక్తిగత వివరాలు బహిర్గతం చేసేటప్పుడు మీరు జాగ్రత్త వహించాలి. అలాంటి సమాచారం మా గోప్యతా విధానం ద్వారా రక్షించబడదు లేదా మీరు అలాంటి పోస్టింగ్‌ల ద్వారా మీ వ్యక్తిగత వివరాలు బహిర్గతం చేయాలని భావిస్తే అట్టి దానికి మేము బాధ్యత వహించము. అలాగే ప్రచురణ కోసం మా వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసే వ్యక్తిగత వివరాలు ఇంటర్నెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండవచ్చు. అటువంటి సమాచారాన్ని ఇతరులు ఉపయోగించడం లేదా దుర్వినియోగం చేయడాన్ని మేము నిరోధించలేము.
TML వెబ్‌సైట్స్‌లో ఇతర వెబ్‌సైట్స్ లింక్స్ కూడా ఉండవచ్చు. అట్టి వెబ్‌సైట్స్‌ను మీరు దిగువ పేర్కొన్న రీతిలో యాక్సెస్ చేసినా ఆ గోప్యత లేదా అందలి కంటెంట్‌కు TML బాధ్యత వహించదు:
- మా వెబ్‌సైట్ ద్వారా లింకులు ఉపయోగించిన మీరు థర్డ్ పార్టీ వెబ్‌సైట్ యాక్సెస్ చేసినా, లేదా
- థర్డ్ పార్టీ వెబ్‌సైట్ ద్వారా మీరు మా వెబ్‌సైట్‌కు లింక్ అయినా.
మీ వ్యక్తిగత డేటా మేము ఎలా ఉపయోగిస్తామంటే
సరైన కారణం ఉంటే మాత్రమే మేము మీ వ్యక్తిగత డేటా ఉపయోగిస్తాం. మేము ఈ కారణాలలో ఒకటి లేదా అంతకంటే ఉన్నప్పుడు మాత్రమే మీ డేటా ఉపయోగిస్తాము:
- మీతో మేము కలిగి ఉన్న ఒప్పందాన్ని నెరవేర్చడానికి, లేదా
- ఒక నిర్దిష్ట కారణం కోసం మీ డేటా ఉపయోగించడానికి మాకు చట్టపరమైన బాధ్యత ఉంటే, లేదా
- మేము దానిని ఉపయోగించడానికి మీ సమ్మతి పొందినప్పుడు, లేదా
- మీ డేటా ఉపయోగించడం కోసం మా వ్యాపార లేదా వాణిజ్యపరమైన కారణాలు మా చట్టబద్ధమైన ప్రయోజనాలకు సంబంధించినవి అయినప్పుడు. అలాంటి సందర్భాల్లో మా న్యాయబద్ధమైన ఆసక్తులను మీకు ఉత్తమమైన వాటి కంటే అన్యాయంగా ఉంచము.
మీ సమాచార వినియోగమన్నది మేము ఉపయోగించే సమయంలో గోప్యతా నోటీసుకు లోబడి ఉంటుంది. సాధారణ వ్యాపార ప్రయోజనాల కోసమే మాకు అందించిన సమాచారాన్ని TML ఉపయోగిస్తుంది. అందులో ఈ ప్రయోజనాలు కూడా ఉండవచ్చు:
- మీ విజ్ఞప్తులపై స్పందించేందుకు;
- కస్టమర్ సర్వీస్ సమస్యలు సహ మీకు సేవలందించేందుకు;
- మా లేదా మా అనుబంధ సంస్థల ప్రస్తుత సేవలు, మేము అభివృద్ధి చేస్తున్న కొత్త సేవలు లేదా ప్రమోషన్లు, మీకు అందుబాటులో ఉండే అవకాశాల గురించి మీకు కమ్యూనికేషన్ పంపడానికి;
- మా సేవలకు సంబంధించి కొత్త ఫీచర్లు లేదా మెరుగుదలల గురించి మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి;
- మీరు అడిగిన ఉద్యోగం లేదా కెరీర్ అవకాశాల గురించి మీతో కమ్యూనికేట్ చేయడానికి;
- మా సైట్, మా సేవలు మీ కోసం ప్రభావవంతమైన రీతిలో పనిచేసేలా నిర్ధారించడానికి;
- ప్రకటనలు, ఔట్‌రీచ్ ప్రభావాన్ని కొలవడానికి లేదా అర్థం చేసుకోవడానికి;
- వెబ్‌సైట్స్, నియమ నిబంధనల్లో మార్పులు, వినియోగదారు ఒప్పందాలు, విధానాలు మరియు/ లేదా ఇతర పరిపాలనా సమాచారానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని మీకు పంపడానికి.
- మార్కెటింగ్, ఈవెంట్స్: ఈమెయిల్, టెలిఫోన్, టెక్స్ట్ మెసేజింగ్, డైరెక్ట్ మెయిల్, ఆన్‌లైన్ వంటి వివిధ వేదికల ద్వారా మీకు మార్కెటింగ్, ఈవెంట్ కమ్యూనికేషన్‌లను అందించడానికి మేము వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగిస్తాము. మేము మీకు మార్కెటింగ్ ఈమెయిల్ పంపితే, భవిష్యత్తులో అలాంటి మెయిల్స్ స్వీకరించకుండా ఎలా నిలిపివేయాలనే సూచనలు కూడా ఆ ఈమెయిల్‌లో ఉంటాయి. మేము మీ సమాచారాన్ని మార్కెటింగ్ ప్రాధాన్యతను నిర్వహించడానికి మీ కోసం ఈమెయిల్ ప్రాధాన్యత కేంద్రాలు కూడా నిర్వహిస్తాము. మీరు మార్కెటింగ్ ఈమెయిల్‌లను స్వీకరించరాదని అనుకున్నా మీ ఖాతా, సభ్యత్వానికి సంబంధించిన ముఖ్యమైన సేవా సమాచారాన్ని మేము మీకు పంపించగలమని దయచేసి గుర్తుంచుకోండి.
- సంభావ్య ఉల్లంఘనలు పరిశోధించడానికి లేదా TML, మా వెబ్‌సైట్ వినియోగదారుల హక్కులు, ఆస్తి లేదా భద్రతను రక్షించడానికి.
- చట్టపరమైన బాధ్యతలు: నేరాన్ని నిరోధించడం, గుర్తించడం లేదా దర్యాప్తు, నష్టనివారణ లేదా మోసం వంటి చట్టపరమైన కారణాల కోసం వ్యక్తిగత సమాచారాన్ని మేము ఉపయోగించవచ్చు, దానిని మేము కలిగి ఉండవచ్చు. మేము మా అంతర్గత, బాహ్య ఆడిట్ అవసరాలు, సమాచార భద్రతా ప్రయోజనాల కోసం అవసరమైన లేదా సముచితమని మేము విశ్వసించే వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఉపయోగించవచ్చు:
- వర్తించే చట్టం ప్రకారం, ఇది మీ నివాస దేశం వెలుపల ఉన్న చట్టాలు కూడా ఇందులో ఉండవచ్చు;
- న్యాయస్థానాలు, చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు, నియంత్రణ సంస్థలు, ఇతర పబ్లిక్, ప్రభుత్వ అధికారుల నుంచి వచ్చే అభ్యర్థనలకు ప్రతిస్పందించడానికి, ఇందులో మీ నివాస దేశం వెలుపల ఉన్న అధికారులు కూడా ఉండవచ్చు;
మీకు సేవలందించేందుకు లేదా మీ విచారణలకు ప్రతిస్పందించడానికి సహేతుకంగా అవసరమైన అటువంటి సమాచారాన్ని మాత్రమే సేకరించడానికి మేము ప్రయత్నిస్తాము. మీరు అందించే సమాచారం కచ్చితమైనదని, సంపూర్ణమైన తాజా సమాచారమని నిర్ధారించేందుకు మీరు బాధ్యత వహిస్తారు.
మా వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్ లేదా మరేదైనా విధానంలో మీ సంప్రదింపు వివరాలు అందించడం ద్వారా, మీరు ఈమెయిల్, SMS, ఫోన్ కాల్ మరియు/లేదా వాట్సప్ ద్వారా TML లేదా దాని అనుబంధ/అనుబంధ సంస్థ నుంచి కమ్యూనికేషన్ స్వీకరించడానికి అంగీకరిస్తున్నారు.
ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఏ సమయంలోనైనా తన స్వీయ విచక్షణ మేరకు TML తన వెబ్‌సైట్‌ను మొత్తంగా గాని పాక్షికంగాని, దానికి సంబంధించిన సేవలు లేదా అందులో ఏదైనా భాగానికి సంబంధించి యాక్సెస్ మీరు పొందకుండా TML రద్దు చేయవచ్చు.
మీ వ్యక్తిగత డేటా ఎప్పుడూ షేర్ చేస్తామంటే
సేవలు అందించడానికి లేదా మా వ్యాపార కార్యకలాపాల నిర్వాహణకు అవసరమైనప్పుడు వ్యక్తిగత డేటాను TML షేర్ చేస్తుంది లేదా బహిర్గతం చేస్తుంది. TML మీ వ్యక్తిగత డేటా బయటికి బదిలీ చేయాలని భావిస్తే, మీ గోప్యతా హక్కులు పరిరక్షించేందుకు TML చర్యలు తీసుకుంటుంది, తగిన రక్షణలు అమలులో ఉండేలా నిర్ధారించుకుంటుంది. మీకు సంబంధించిన వ్యక్తిగత డేటా ఏ ప్రత్యేక వర్గాలను మేము సేకరించము (ఇందులో మీ జాతి లేదా జాతి,మతపరమైన లేదా తాత్విక విశ్వాసాలు, లైంగిక జీవితం, లైంగిక ధోరణి, రాజకీయ అభిప్రాయాలు, ట్రేడ్ యూనియన్ సభ్యత్వం, మీ ఆరోగ్యం, జన్యుపరమైన, బయోమెట్రిక్ డేటా గురించిన వివరాలు ఉంటాయి). అలాగే మేము నేరారోపణలు, నేరాల గురించి ఎటువంటి సమాచారాన్ని సేకరించము.
TML మీ సమ్మతితో, ఈ సైట్‌లో పేర్కొన్న ఉద్యోగ అవకాశాల కోసం మీ దరఖాస్తుకు సంబంధించి లేదా మా అనుబంధ సంస్థలలో ఒకదాని వెబ్‌సైట్‌లో పేర్కొన్న అవకాశాలకు సంబంధించి లేదా TML అనుబంధం లేని థర్డ్ పార్టీ కస్టమర్లకు మీ గురించిన సమాచారాన్ని బహిర్గతం చేయవచ్చు. ఉదాహరణకు-
TML లోపల: ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా వ్యాపారాలకు వివిధ రకాల TML బృందాలు, విధులు మద్దతు ఇస్తున్నాయి. సేవలు, ఖాతాల నిర్వహణ, సేల్స్, మార్కెటింగ్, కస్టమర్, టెక్నికల్ సపోర్ట్, వ్యాపార, ఉత్పత్తి అభివృద్ధి కోసం అవసరమైతే వ్యక్తిగత సమాచారం వారికి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. వ్యక్తిగత డేటా హ్యాండిల్ చేసేటప్పుడు మా ఉద్యోగులు, కాంట్రాక్టర్లందరూ భద్రతా విధానాలు అనుసరించాల్సి ఉంటుంది.
అనుబంధ సంస్థలు: మా మాతృ సంస్థ, అనుబంధ సంస్థలు, జాయింట్ వెంచర్లు, గ్రూప్, అసోసియేట్ కంపెనీలు. ఈ సంస్థలన్నీ పైన పేర్కొన్న ప్రయోజనాల కోసం ఈ సమాచారాన్ని ఉపయోగించవచ్చు.
డీలర్లు: స్వతంత్ర యాజమాన్యం, నిర్వహణలో మా అధీకృత డీలర్లు ఉంటారు. వారు తమ మార్కెటింగ్, కస్టమర్ సేవ, నెరవేర్చడం, సంబంధిత ప్రయోజనాలు సహా రోజువారీ వ్యాపార ప్రయోజనాల కోసం వారు ఈ సమాచారాన్ని ఉపయోగించవచ్చు.
పంపిణీదారులు: స్వతంత్ర యాజమాన్యం, నిర్వహణలో మా అధీకృత పంపిణీదారులు ఉంటారు. వారు తమ మార్కెటింగ్, కస్టమర్ సేవ, నెరవేర్చడం, సంబంధిత ప్రయోజనాలు సహా రోజువారీ వ్యాపార ప్రయోజనాల కోసం వారు ఈ సమాచారాన్ని ఉపయోగించవచ్చు.
మా వ్యాపార భాగస్వాములు: సహ-బ్రాండెడ్ సేవలు అందించడానికి, కంటెంట్ అందించడానికి లేదా ఈవెంట్‌లు, సమావేశాలు, సెమినార్లు నిర్వహించడానికి మేము అప్పుడప్పుడు ఇతర సంస్థలతో సహకరిస్తాము. ఈ ఏర్పాట్లలో భాగంగా, మీరు TML, మా భాగస్వాములు, మా భాగస్వాములు రెండింటికీ కస్టమర్‌గా ఉండవచ్చు, మేము మీ గురించి సమాచారాన్ని సేకరించి,పంచుకోవచ్చు. గోప్యతా నోటీసుకు అనుగుణంగా వ్యక్తిగత డేటాను TML నిర్వహిస్తుంది.
మా థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్లు: అవసరమైన తోడ్పాటు కోసం మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వీస్ ప్రొవైడర్లకో సహకరిస్తాము. సాఫ్ట్‌వేర్, సిస్టమ్, ప్లాట్‌ఫామ్ మద్దతు, డైరెక్ట్ మార్కెటింగ్ సర్వీసెస్, క్లౌడ్ హోస్టింగ్ సేవలు, ప్రకటనలు, ఆర్డర్ నెరవేర్చడం, డెలివరీ వంటి సేవలు నెరవేర్చడానికి అవసరమైనప్పుడు మాత్రమే ఈ పార్టీలకు వ్యక్తిగత డేటా అందుబాటులో ఉంచబడుతుంది. మాకు సేవలందించడం మినహా వేరే ఇతర ప్రయోజనాల కోసం మేమందించే వ్యక్తిగత డేటాను థర్డ్ పార్టీ సర్వీసు ప్రొవైడర్లు ఉపయోగించేందుకు అనుమతి ఉండదు. మేము మీ వ్యక్తిగత వివరాల ప్రాసెసింగ్ థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్లకు అప్పగించాల్సిన వచ్చిన సందర్భంలో మేము తగిన లేదా తగిన సాంకేతిక, భౌతిక రక్షణ నిర్వహించగల థర్ట్ పార్టీ సర్వీసు ప్రొవైడర్లను మాత్రమే ఎంచుకుంటాము. అటువంటి థర్ట్ పార్టీ సేవలు నియంత్రిస్తాము, పర్యవేక్షిస్తాం. మార్కెటింగ్ ప్రయోజనాల కోసం మీ వ్యక్తిగత వివరాలు థర్డ్ పార్టీలకు విక్రయించము లేదా అద్దెకు ఇవ్వము. అయితే, డేటా అగ్రిగేషన్ ప్రయోజనాల కోసం మేము మీ వ్యక్తిగత డేటా ఉపయోగించవచ్చు, ఇది మా అభీష్టానుసారం ఇతర పార్టీలకు విక్రయించడం కూడా చేయవచ్చు. అటువంటి డేటా అగ్రిగేషన్ ఏదైనా మీ వ్యక్తిగత వివరాలు కలిగి ఉండదు. మేము మీ మొదటి పేరు, ఇంటిపేరు, ఈమెయిల్ చిరునామా, ఫోన్ నంబర్, చిరునామా, నగరం, రాష్ట్రం, ప్రావిన్స్ ప్రాంతం వంటి ప్రత్యేక సంరక్షణ-అవసరమైన వ్యక్తిగత సమాచారం" మినహా పైన పేర్కొన్న డేటా సేకరించే ఉద్దేశంలో వివరించిన మీ వ్యక్తిగత వివరాలు అందించవచ్చు. కుక్కీలు, థర్ట్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లకు IP చిరునామా, ఈమెయిల్, ఇంటర్నెట్ మొదలైన వాటి ద్వారా మాకు సేవలు అందించడానికి మీ సమ్మతి లేకుండా మేము నియమిస్తాము. ఈ థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్లు వీటిని కలిగి ఉండవచ్చు కాీనీ వీటికే వారి పరిమితం కారు: చెల్లింపు ప్రాసెసర్లు, అన్ని కేంద్రాలు, డేటా మేనేజ్‌మెంట్ సేవలు, హెల్ప్ డెస్క్ ప్రొవైడర్లు, అకౌంటెంట్లు, న్యాయ సంస్థలు, ఆడిటర్లు, షాపింగ్ కార్ట్, ఈమెయిల్ సర్వీస్ ప్రొవైడర్లు, షిప్పింగ్ కంపెనీలు. అటువంటి థర్ట్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లకు మీ వ్యక్తిగత డేటా అందించడానికి సంబంధించి మేము తగిన లేదా తగిన సాంకేతిక, భౌతిక రక్షణలు నిర్వహిస్తాము. అటువంటి థర్ట్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లకు మీ వ్యక్తిగత డేటా అందించడాన్ని నిలిపివేయమని మీరు మమ్మల్ని అభ్యర్థించినప్పుడు, అటువంటి థర్ట్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లకు మీ వ్యక్తిగత డేటా అందించడాన్ని మేము నిలిపివేస్తాము. మీరు అటువంటి భద్రతల కాపీని పొందాలనుకున్నా లేదా థర్ట్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లకు మీ వ్యక్తిగత వివరాలు అందించడాన్ని నిలిపివేయాలనుకున్నా- [email protected]కు మీ అభ్యర్థనతో మాకు ఈమెయిల్ పంపండి. మేము మీ వ్యక్తిగత వివరాలు ఏదైనా థర్ట్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లకు అందించినప్పుడు లేదా ఏదైనా థర్ట్ పార్టీ నుంచి వ్యక్తిగత వివరాలు స్వీకరించినప్పుడు, మేము అలాంటి సదుపాయం లేదా రసీదు రికార్డ్ చేస్తాము. మేము ఏదైనా థర్డ్ పార్టీ నుంచి వ్యక్తిగత వివరాలు స్వీకరించినప్పుడు, అటువంటి వ్యక్తిగత వివరాలు పొందిన పరిస్థితులను మేము తనిఖీ చేస్తాము.
న్యాయపరమైన కారణాల కోసం థర్డ్ పార్టీలు: అవసరమని మేము భావించినప్పుడు వ్యక్తిగత డేటా మేము పంచుకుంటాం, అంటే:
- చట్టపరమైన బాధ్యతలు పాటించడం, ప్రభుత్వ ఏజెన్సీలు, మీ నివాస దేశం వెలుపలి అధికారులు సహ చట్టాన్ని అమలు చేసే ప్రభుత్వాధికారుల అభ్యర్థనలకు ప్రతిస్పందించడం.
- మా వ్యాపారం, ఆస్తులు లేదా స్టాక్‌లో (ఏదైనా దివాలా లేదా సారూప్య ప్రక్రియలు సహా) విలీనం, అమ్మకం, పునర్నిర్మాణం, స్వాధీనం, జాయింట్ వెంచర్, అసైన్‌మెంట్, బదిలీ లేదా ఏదైనా ఇతర భాగస్వామ్య సందర్భంలో
- మా హక్కులు, వినియోగదారులు, సిస్టమ్‌లు, సేవలు రక్షించడానికి.
వ్యక్తిగత డేటా మేము ఎక్కడ నిల్వ చేస్తాం, ఎలా ప్రాసెస్ చేస్తామంటే
ఒక అంతర్జాతీయ సంస్థగా TML, సేకరించే సమాచారాన్ని ఈ గోప్యతా నోటీసుకు అనుగుణంగా, డేటా ఎక్కడ అయితే ఉందో అక్కడి వర్తించే చట్టాల అవసరాలకు అనుగుణంగా డేటా ప్రాసెస్ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటుంది. నెట్‌వర్క్‌లు, డేటాబేస్‌లు, సర్వర్లు, సిస్టమ్స్, సపోర్టు, హెల్ప్ డెస్కుల వంటివి ప్రపంచవ్యాప్తంగా ఉన్న TML ఆఫీసుల్లో ఉన్నాయి. మా వ్యాపారం, సిబ్బంది, కస్టమర్ల అవసరాలు తీర్చడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లౌడ్ హోస్టింగ్ సేవలు, సరఫరాదారులు, సాంకేతిక మద్దతు అందించే థర్ట్ పార్టీలకు మేము సహకరిస్తాము. వర్తించే చట్టం ప్రకారం వ్యక్తిగత డేటా ప్రాసెస్ జరిగిందని, అది సురక్షితంగా ఉందని, బదిలీ చేయబడిందని నిర్ధారించుకోవడానికి మేము తగిన చర్యలు తీసుకుంటాము.
TML మీ వ్యక్తిగత డేటాను ఎవరికీ విక్రయించదు లేదా అద్దెకు ఇవ్వదు. మీరు అభ్యర్థించిన ఉత్పత్తి లేదా సేవ అందించడం వంటి కొన్ని సందర్భాల్లో, అవసరమైతే మేము మీ వ్యక్తిగత డేటా TMLలో లేదా మూడవ పక్షాలకు బహిర్గతం చేయాల్సి ఉంటుంది లేదా బదిలీ చేయాల్సి ఉంటుంది. మీ స్వదేశంలో ఉన్న డేటా గోప్యతా రక్షణను వర్తించే చట్టాలు అందించని ఇతర దేశాలకు మేము వ్యక్తిగత సమాచారాన్ని బదిలీ చేసినప్పుడు, మేము తగిన స్థాయిలో డేటా గోప్యతా రక్షణ అందించడానికి చర్యలు తీసుకుంటాము. ఉదాహరణకు, మేము ఆమోదించిన ఒప్పంద నిబంధనలు, బహుళ పక్ష డేటా బదిలీ ఒప్పందాలు, ఇంట్రాగ్రూప్ ఒప్పందాలు మీ వ్యక్తిగత సమాచారాన్ని గ్రహీతలు రక్షించడానికి రూపొందించిన ఇతర చర్యలు ఉపయోగిస్తాము.
వ్యక్తిగత డేటాను మేము ఎలా పదిలంగా ఉంచుతామంటే
TML మీ వ్యక్తిగత డేటా రక్షించడానికి తగిన సాంకేతికతలు, విధానాలు ఉపయోగిస్తుంది. మా సమాచార భద్రతా విధానాలు, ప్రక్రియలు విస్తృతంగా ఆమోదించిన అంతర్జాతీయ ప్రమాణాలకు దగ్గరగా ఉంటాయి. మా వ్యాపార అవసరాలు, సాంకేతికతలో మార్పులు, నియంత్రణ అవసరాలకు అనుగుణంగా క్రమం తప్పకుండా సమీక్షించడం, నవీకరించడం జరుగుతుంది. ఉదాహరణకు,
- విధానాలు, ప్రక్రియలు: TML మీ వ్యక్తిగత డేటా నష్టం, దుర్వినియోగం, మార్పు లేదా అనుకోకుండా విధ్వంసం నుంచి రక్షించడానికి ఉద్దేశించిన సహేతుకమైన సాంకేతిక, భౌతిక, కార్యాచరణ భద్రతా విధానాలు ఉపయోగిస్తుంది. మీ గురించి సేకరించిన మొత్తం డేటాకు తగిన భద్రతను అందించే ప్రయత్నంలో మా భద్రతా చర్యలు క్రమానుగతంగా సమీక్షించడం, నవీకరించడం జరుగుతుంది.
- మేము మీ వ్యక్తిగత డేటా ప్రాప్యతపై తగిన పరిమితులు ఉంచుతాము.
- డేటా సురక్షితంగా నిల్వ చేయడానికి, బదిలీ చేయడానికి మేము పర్యవేక్షణ, భౌతిక చర్యలు సహా తగిన భద్రతా చర్యలు, నియంత్రణలు అమలు చేస్తాము.
- వ్యక్తిగత డేటాకు ప్రాప్యత కలిగి ఉన్న మా ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు గోప్యత, సమాచార భద్రత సహ ఇతర వర్తించే శిక్షణ అందిస్తాం.
- మా సమాచార భద్రతా విధానాలు, ప్రక్రియలు సహ వర్తించే ఒప్పంద షరతులకు అనుగుణంగా మా ఉద్యోగులు, కాంట్రాక్టర్లు పనిచేసేలా మేము చర్యలు తీసుకుంటాము.
- ఒప్పందాలు, భద్రతా సమీక్షలు సహ మా థర్డ్ పార్టీ విక్రేతలు, ప్రొవైడర్లు మా భద్రతా విధానాలు, ప్రక్రియలకు అనుగుణంగా తమకు అప్పగించిన ఏదైనా వ్యక్తిగత డేటాను రక్షించడం మాకు అవసరం.
కుక్కీస్
మేము “cookie†అనే ప్రామాణిక సాంకేతికతను ఎప్పటికప్పుడు ఉపయోగించవచ్చు. కుక్కీ అనేది కంప్యూటర్ లేదా ఇతర పరికరంలో ఉంచే చిన్న టెక్స్ట్ ఫైల్. వినియోగదారుని లేదా పరికరాన్ని గుర్తించడానికి, సమాచారాన్ని సేకరించడానికి ఇది ఉపయోగపడుతుంది. కుక్కీలు సాధారణంగా వాటి పనితీరు, ఉద్దేశించిన ప్రయోజనం ఆధారంగా నాలుగు వర్గాల్లో ఒకటిగా ఉంటాయి: అవసరమైన కుక్కీలు, పనితీరు కుక్కీలు, ఫంక్షనల్ కుక్కీలు, మార్కెటింగ్ ప్రయోజనాల కోసం కుక్కీలు. కుక్కీ మీ హార్డ్ డ్రైవ్ నుంచి ఏ ఇతర డేటా తిరిగి పొందదు, కంప్యూటర్ వైరస్‌లు పంపదు, మీ ఈమెయిల్ చిరునామా సంగ్రహించదు. ప్రస్తుతం, వినియోగదారు సందర్శనను మెరుగుపరచడానికి వెబ్‌సైట్‌లు కుక్కీలు ఉపయోగిస్తాయి; సాధారణంగా కుక్కీలు వినియోగదారు ID, పాస్‌వర్డ్ సురక్షితంగా నిల్వ చేయగలవు, హోమ్ పేజీలను వ్యక్తిగతీకరించగలవు, సైట్‌లోని ఏ భాగాలు సందర్శించారో గుర్తించగలవు. కుక్కీ ఎప్పుడు ఉంచబడుతుందో మీరు బ్రౌజర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ విధంగా మీరు కుకీని అంగీకరించాలా వద్దా అని నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. మా సందర్శకులు ఈ వెబ్‌సైట్‌ను ఎలా, ఎప్పుడు ఉపయోగిస్తున్నారో తెలుసుకోవడం ద్వారా, మా సైట్‌ని నిరంతరం మెరుగుపరచడంలో ఈ సమాచారం మాకు సాయపడుతుంది. మీరు మాకు ప్రత్యేకంగా అదనపు సమాచారాన్ని అందిస్తే తప్ప, కుక్కీలు మీ గురించి వ్యక్తిగతంగా మాకు ఏమీ చెప్పవు. TML మా కుక్కీ సమాచారాన్ని మేము లేదా థర్డ్ పార్టీల నుంచి గ్రహించిన వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారంతో విలీనం చేయదు లేదా అనుసంధానం చేయదు.
మేము వీటి కోసం కుక్కీలను ఉపయోగించవచ్చు: (i) వెబ్‌సైట్‌ని మీరు సందర్శించిన సంఖ్య లెక్కించేందు (ii) వెబ్‌సైట్ వినియోగంపై అనామక, సమగ్ర, గణాంక సమాచారాన్ని సేకరించడం; (iii) మీ అవసరం లేదా వీక్షణ చరిత్ర ప్రకారం తగిన కంటెంట్ అందించడం; (iv) మీ పాస్‌వర్డ్ సేవ్ చేయడం (మీరు అలా చేయడానికి అనుమతించినప్పుడు మాత్రమే) కాబట్టి మీరు మా సైట్స్ సందర్శించిన ప్రతిసారీ దాన్ని మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. మీరు కుక్కీలు నిలిపివేయవచ్చు. మీ బ్రౌజర్ ప్రాధాన్యత సవరించడం ద్వారా మీరు అన్ని కుక్కీలను ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు లేదా కుక్కీని సెట్ చేసినప్పుడు నోటిఫికేషన్ అభ్యర్థించవచ్చు.
కచ్చితంగా అవసరమైన కుక్కీలు
కంటెంట్ ప్రదర్శించడం, లాగిన్ చేయడం, మీ సెషన్ ధృవీకరించడం, సేవల కోసం మీ అభ్యర్థనకు ప్రతిస్పందించడం, వెబ్‌సైట్ సరైన పనితీరు సహ ఇతర విధులు వంటి వాటి కోసం కుక్కీలు అవసరం. కుక్కీల వినియోగాన్ని నిలిపివేయడానికి చాలా వెబ్ బ్రౌజర్లలో వెసులుబాటు ఉంది. మీరు ఈ కుక్కీలు ఆపేస్తే మీరు మా వెబ్‌సైట్‌లోని ఫీచర్లను సరిగ్గా యాక్సెస్ చేయలేకపోవచ్చు.
పిల్లలు
మేము పిల్లలకు నేరుగా సేవలు అందించము లేదా వారి వ్యక్తిగత సమాచారాన్ని ముందుగా సేకరించము. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు మా వెబ్‌సైట్ ఉపయోగించేందుకు పిల్లలకు అధికారం ఇవ్వవచ్చు. అయితే పరిమితి లేకుండా TML సైట్ పిల్లల యాక్సెస్, వినియోగాన్ని పర్యవేక్షించడంతో పాటు, అటువంటి పిల్లల ప్రవర్తనకు అన్ని బాధ్యతలు, చట్టపరమైన బాధ్యతలకు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు బాధ్యత వహించాలి.
తల్లిదండ్రుల నుంచి ధృవీకృత సమ్మతి లేకుండా పిల్లల వ్యక్తిగత డేటా సేకరించడం జరిగిందని TML తెలుసుకుంటే, అటువంటి సమాచారాన్ని తొలగించడానికి TML తగిన చర్యలు తీసుకోవచ్చు. అయినప్పటికీ, మీ చిన్నారి అతని/ఆమె డేటాను TMLకి సమర్పించినట్లు మీరు గుర్తిస్తే, మీరు ఈమెయిల్ అభ్యర్థన పంపడం ద్వారా TML డేటాబేస్ నుంచి అటువంటి డేటా తొలగించమని అభ్యర్థించవచ్చు. అభ్యర్థనను స్వీకరించిన తర్వాత, TML తన డేటాబేస్ నుంచి అటువంటి సమాచారాన్ని తొలగిస్తుంది.
మీ హక్కులు, మీ వ్యక్తిగత డేటా
మీ సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి, నియంత్రించడానికి మీ హక్కులను మేము గౌరవిస్తాము. సమాచారం కోసం అభ్యర్థనలకు మేము ప్రతిస్పందిస్తాము. వర్తించే చోట, మీ వ్యక్తిగత సమాచారాన్ని సరిదిద్దుతాము, సవరిస్తాము లేదా తొలగిస్తాము.
అటువంటి సందర్భాలలో మీరు ఈ హక్కులు వినియోగించుకునే ముందు మీ గుర్తింపు రుజువుతో మీరు ప్రతిస్పందించాల్సి ఉంటుంది.
- సమాచారాన్ని యాక్సెస్ చేసే హక్కు: ఏ సమయంలోనైనా మీరు మా దగ్గరున్న సమాచారాన్ని అభ్యర్థించడానికి అలాగే మా దగ్గర ఆ సమాచారం ఎందుకు ఉంది, ఎవరికి ఆ సమాచార ప్రాప్యత ఉంది, మేము ఆ సమాచారాన్ని ఎక్కడ నుంచి పొందామో మీరు మమ్మల్ని సంప్రదించి, అభ్యర్థించవచ్చు. మేము మీ అభ్యర్థన స్వీకరించిన తర్వాత మేము ఒక నెలలోపు ప్రతిస్పందిస్తాము. మొదటి అభ్యర్థనకు ఎటువంటి రుసుములు లేదా ఛార్జీలు ఉండవు, అదే డేటా కోసం అదనపు అభ్యర్థనలు అందితే అడ్మినిస్ట్రేటివ్ రుసుము వర్తించవచ్చు. యాక్సెస్ అభ్యర్థించడానికి మీరు కారణాన్ని తెలపాల్సిన అవసరం లేదు, కానీ మీరు మీ గుర్తింపు కోసం కొంత సహేతుకమైన రుజువు అందజేయాల్సి ఉంటుంది.
- సమాచార దిద్దుబాటు, నవీకరణ హక్కు: మేము మీ దగ్గర కలిగి ఉన్న డేటా అప్ టు డేట్ లేకపోయినా, అసంపూర్తిగా లేదా తప్పుగా ఉన్నా, మీరు మాకు తెలియజేయవచ్చు. దానిని మేము అప్‌డేట్ చేస్తాం.
- మీ సమాచారాన్ని తొలగించే హక్కు: మేము ఇకపై మీ డేటా ఉపయోగించకూడదని లేదా మేము మీ డేటా చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తున్నామని మీరు భావిస్తే, మా దగ్గరున్న డేటా తొలగించమని మీరు అభ్యర్థించవచ్చు. మేము మీ అభ్యర్థనను స్వీకరించినప్పుడు, డేటా తొలగించబడిందా లేదా తొలగించబడకపోవడానికి గల కారణాన్ని (ఉదాహరణకు ఇది మా చట్టబద్ధమైన ఆసక్తులు లేదా నియంత్రణ ప్రయోజనం(ల) మాకు అవసరం కాబట్టి మేము నిర్ధారిస్తాము.
- ప్రాసెస్ చేయడానికి అభ్యంతరం చెప్పే హక్కు: మేము మీ డేటా ప్రాసెస్ చేయడాన్ని ఆపేయమని అభ్యర్థించడానికి మీకు హక్కు ఉంటుంది. అభ్యర్థనను స్వీకరించిన తర్వాత మేము మిమ్మల్ని సంప్రదిస్తాము, మేము దానికి కట్టుబడి ఉండగలమా లేదా మీ డేటా ప్రాసెస్ చేయడం కొనసాగించడానికి మాకు చట్టబద్ధమైన కారణాలు ఉంటే మీకు తెలియజేస్తాము. మీరు అభ్యంతరం చెప్పే హక్కు వినియోగించుకున్న తర్వాత కూడా మీ ఇతర హక్కులకు అనుగుణంగా లేదా చట్టపరమైన క్లెయిమ్‌లను తీసుకురావడానికి లేదా రక్షించడానికి మేము మీ డేటా కలిగి ఉండటాన్ని కొనసాగించవచ్చు.
- డేటా పోర్టబిలిటీ హక్కు: మేము మీ డేటాలో కొంత భాగాన్ని మరొక కంట్రోలర్‌కు బదిలీ చేయమని అభ్యర్థించడానికి మీకు హక్కు ఉంది. మీ అభ్యర్థన స్వీకరించిన ఒక నెలలోపు మేము ఆ అభ్యర్థనను పరిశీలిస్తాం.
- ప్రాసెసింగ్ చేసేందుకు సమ్మతి తెలిపిన డేటాకు సంబంధించిన సమ్మతిని మీరు ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు. మీరు టెలిఫోన్, ఈమెయిల్ లేదా పోస్ట్ ద్వారా సులభంగా మీ సమ్మతి ఉపసంహరించుకోవచ్చు (సమ్మతి ఉపసంహరణ ఫామ్ చూడండి).
- వర్తించే చోట వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్‌పై అభ్యంతరం చెప్పే హక్కు.
- డేటా రక్షణ ప్రతినిధికి ఫిర్యాదు చేసే హక్కు.
- ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించడం ద్వారా మీకు మార్కెటింగ్ సందేశాలు పంపడాన్ని ఆపివేయమని మీరు మమ్మల్ని లేదా థర్డ్ పార్టీలను అడగవచ్చు. మీరు ఈ మార్కెటింగ్ సందేశాలు స్వీకరించకుండా నిలిపివేసిన సందర్భంలో ఉత్పత్తి/సేవ కొనుగోలు, వారంటీ నమోదు, ఉత్పత్తి/సేవ అనుభవం లేదా ఇతర లావాదేవీల ఫలితంగా మాకు అందించబడిన వ్యక్తిగత డేటాకు ఇది వర్తించదు.
- మీరు మా నుంచి లేదా మా అనుబంధ సంస్థల నుంచి తదుపరి ఈమెయిల్ అందుకోవడాన్ని ఎప్పుడైనా నిలిపివేయవచ్చు. మా వ్యాపారాన్ని విక్రయించడం లేదా బదిలీ చేయడం లేదా మా కంపెనీ దివాలా తీయడం కోసం ఫైల్ చేసినప్పుడు మినహా మీ అనుమతి లేకుండా మేము మీ ఈమెయిల్ చిరునామాను ఏ అనుబంధం లేని మూడవ పక్షానికి విక్రయించం, అద్దెకు ఇవ్వం, లేదా వ్యాపారం చేయము.
మీ వ్యక్తిగత డేటాను మేము ఎన్నాళ్ల పాటు కలిగి ఉంటాము?
మేము చట్టపరమైన లేదా వ్యాపార ప్రయోజనాల కోసం సహేతుకంగా అవసరమైనంత వరకు వ్యక్తిగత సమాచారాన్ని నిలుపుదల చేసుకుంటాము. డేటా నిలుపుదల వ్యవధి నిర్ణయించడంలో స్థానిక చట్టాలు, ఒప్పంద బాధ్యతలు, మా కస్టమర్ల అంచనాలు, అవసరాలును TML పరిగణనలోకి తీసుకుంటుంది. మాకు వ్యక్తిగత సమాచారం అవసరం లేనప్పుడు, మేము దానిని సురక్షితంగా తొలగిస్తాము లేదా నాశనం చేస్తాము.
మార్పులు
TML గోప్యతా విధానాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయవచ్చు. ప్రస్తుత గోప్యతా విధానాన్ని చూడటానికి మా వెబ్‌సైట్‌ను తరచుగా తనిఖీ చేయమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. తద్వారా TML మీ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తుందో, రక్షిస్తుందో మీరు తెలుసుకోవచ్చు. ఈ విధానంలో ముఖ్యమైన మార్పు చేసినప్పుడు మేము ఈ వెబ్‌సైట్‌లో ఒక ప్రముఖ నోటీసు ఉంచి నవీకరించిన ప్రభావిత తేదీ అందిస్తాము.
అందించిన డేటా సంరక్షణ
మాకు మీరందించిన మీ వ్యక్తిగత డేటా పరిరక్షించేందుకు మేము కఠినమైన భద్రతా చర్యలు చేపడతాము. వ్యక్తిగత సమాచార నష్టం, దుర్వినియోగం, తప్పుడు రీతిలో బహిర్గతం చేయడం, మార్చడం లేదా నాశనం వంటివి నిరోధించేందుకు మేము సురక్షితమైన పద్ధతిలో నిల్వ చేస్తాం. ఈ భద్రతా చర్యలు ఎప్పటికప్పుడూ అప్‌డేట్ చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇంటర్నెట్ ట్రాన్స్‌మిషన్ సమయంలో జరిగే ఏదైనా అనుకోని నష్టం, దుర్వినియోగం, మార్పు లేదా అటువంటి సమాచారం బహిర్గతమవడం వంటి భద్రతా ఉల్లంఘనకు TML బాధ్యత వహించదు. ఈ గోప్యతా విధానంలో ఏది ఉన్నప్పటికీ ఊహించని సంఘటనలు లేదా మీకు ఆపాదించే కారణం వల్ల వ్యక్తిగత సమాచార నష్టం, దుర్వినియోగం అయినట్లయితే అట్టిదానికి TML బాధ్యత వహించదు.
TML may disclose your personal data in good faith or whenever necessary to comply with a legal obligation or if disclosure was required by any law or by order of any competent court or statutory authority, to protect and defend the legal rights or Intellectual Property Rights of TML.
Your Obligations
You warrant to TML that you will not use the Website for any purpose that is illegal or prohibited by these terms of use. You shall not use this Website in any manner which could damage, disable, overburden or impair the Website or interfere with any other party's use and enjoyment of this Website. You shall not modify, copy, distribute, transmit, display, reproduce, publish, license, create derivative works from, transfer, or sell any data, services obtained from TML website without our prior consent, directly or indirectly in any medium. Neither these materials nor any portion thereof may be stored in a computer except for personal and non-commercial use.
వర్తించే చట్టం/న్యాయపరధి
భారతదేశపు చట్టాల పరిధిలో ఈ గోప్యతా విధానం ఉంటుంది. వీటి కారణంగా తలెత్తే వివాదాలకు సంబంధించి ముంబయి (భారతదేశం) కోర్టులకు మాత్రమే ప్రత్యేక న్యాయపరిధి ఉంటుంది.
ప్రశ్నలు/సంప్రదించే సమాచారం
ఈ గోప్యతా నోటీసు విధానానికి సంబంధించి మీకు ఏమైనా ప్రశ్నలు లేదా వ్యాఖ్యలు ఉన్నట్టు అయితే దయచేసి మమ్మల్ని ఇక్కడ సంప్రదించగలరు:
ఈమెయిల్: [email protected]
ప్రభావిత తేదీ: 23.03.22